NTR: విజయవాడలో ట్రాఫిక్ సమస్యల నివారణకు పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. కమిషనర్ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీన్ బేగం, ఏసీపీ రామ్ చందర్రావు పర్యవేక్షణలో వన్ టౌన్ కెనాల్ రోడ్డులో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్డుపై వస్తువులు పెట్టి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న షాపులను తొలగించి, యజమానులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.