W.G: రాష్ట్రంలోని ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే నిబంధనలు తొలగించి, రైతుందరికీ విద్యుత్ యూనిట్‌ను రూ.1.50కే అందించాలని డిమాండ్ చేశారు. ఎటువంటి షరతులు లేకుండా ఈ రాయితీని తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.