ELR: చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పాత నాటు సారా కేసుల ముద్దాయిలను మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో హాజరుపరిచారు. వనమా కొండలరావు, కటారి కోటేశ్వరరావులపై మండల మెజిస్ట్రేట్ సమక్షంలో 129 BNSS కింద బైండోవర్ విధించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వారు భవిష్యత్తులో నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలన్నారు.