కృష్ణా: పమిడిముక్కల మండలం ఆగినిపర్రు గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించిన మండల స్థాయి బాల, బాలికల ఆటల పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు.