శ్రీకాకుళం మండలం బావాజీ పేట గ్రామస్థులు శనివారం ఆందోళనకు దిగారు. ముద్దాడపేట ఇసుక ర్యాంపు నుంచి భారీ లారీలతో ఇసుక తరలించడం వల్ల గ్రామ రహదారులు పూర్తిగా అధ్వానంగా మారాయని వారు ఆరోపించారు. రోడ్లపై పెద్ద గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భారీ లారీల రాకపోకలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ధర్నా నిర్వహించారు.