AKP: గొలుగొండలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం ప్రారంభించారు. అనంతరం నూతన భవనాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయిలో కృషి చేయడం జరుగుతుందని హోం మంత్రి అనిత అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ నేర నియంత్రణ చేస్తున్నామన్నారు.