W.G: జిల్లాలో పెండింగ్లో ఉన్న 27,865 ఏకీకృత కుటుంబాల నమోదు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, ఎంఎస్ఈవోలతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వర్ణ గ్రామ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సర్వేలను త్వరితగతిన ముగించాలని సూచించారు.