తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారిలో నటి సురేఖా వాణి(Actress surekha vani) కూడా ఒకరు. తెలుగు సినిమాల్లో ఆమె అమ్మ, అక్క, వదిన పాత్రల్లో నటించి మెప్పించారు. గత కొంతకాలంగా సురేఖా వాణి సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే సోషల్ మీడియా(Social Media)లో మాత్రం యాక్టీవ్ గా ఉంటూ పలు విషయాలను షేర్ చేస్తున్నారు. తన కూతురు సుప్రితతో కలిసి నెట్టింట గ్లామరస్ ఫోటోలను పోస్టు చేస్తున్నారు.
తాజాగా నటి సురేఖా వాణి(Actress surekha vani) తన భర్తను తలచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. దర్శకుడు సురేష్ తేజను సురేశా వాణి వివాహం చేసుకున్నారు. ఆమె భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెళ్లామ్స్ కార్యక్రమానికి యాంకర్ గా కూడా చేశారు. 2019లో అనారోగ్యం కారణంగా సురేఖా వాణి భర్త మరణించారు. అప్పటి నుంచి చాలాసార్లు తన భర్తతో గడిపిన చివరి క్షణాలను తెలుపుతూ సురేఖా వాణి కెమెరా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా భర్తను తలచుకుని సురేఖా వాణి ఎమోషనల్ పోస్టు (Emotional post Viral) చేశారు.
కళ్లలో ఆనందం, సంతోషం కాన్నా కూడా తన భర్త తన పక్కన లేడనే బాధ తనను ఆవేదన గురి చేస్తోందని సురేఖా వాణి (Actress surekha vani) తన పోస్టులో రాసుకొచ్చారు. తన భర్త ప్రేమ, ఆశీర్వాదం తనకు ఎప్పటికీ ఉంటాయని, తన ప్రతి పుట్టినరోజు నాటికి తన భర్త చేసే సందడి, మధుర క్షణాలు ఎప్పటికీ గుర్తుకొస్తునే ఉంటాయని, తన భర్తను చాలా మిస్ అవుతున్నానని తెలిపారు. ప్రస్తుతం సురేఖా వాణి (Actress surekha vani) చేసిన ఎమోషనల్ పోస్టు నెట్టింట వైరల్ (Emotional post Viral) అవుతోంది.