PPM: గుమ్మలక్ష్మీపురం మండలం గడ్డి కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.