NRML: ఖానాపూర్ పట్టణంలోని శాంతి నగర్లో కడారి శివ కుమార్, శిరీష దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి రెండేళ్ల కుమారుడు కడారి బన్నీ కొంతకాలంగా తీవ్రమైన మూత్ర సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ ముందుకొచ్చారు.