AKP: ఎస్ రాయవరం మండలం సోమిదేవిపల్లికి చెందిన నేషనల్ పారా వాలీబాల్ క్రీడాకారుడు అన్నెం గణేష్‌కు జాతీయ పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఈనెల 25 నుంచి 28 వరకు మీరట్‌లో జరిగే టోర్నమెంట్‌కు ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు గణేష్ ఆదివారం తెలిపారు. టోర్నమెంట్లో సత్తా చాటి ఏపీకి మంచి పేరు తీసుకువస్తానన్నారు.