CTR: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలలో భాగంగా ఆదివారం హిందూ సంఘాలవారు పుంగనూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అన్న క్యాంటీన్ నుంచి ఎన్టీఆర్ కూడలి, ఇందిరా సర్కిల్, MBTరోడ్డు గుండా పట్టణ పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. చత్రపతి శివాజీ మహారాజ్‌కు జై అంటూ చేపట్టిన నినాదాలు పట్టణంలో మారుమోగాయి. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.