NDL: బాచాపురం మెట్ట సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కారులో ఉన్నవారికి పెద్ద ప్రమాదం తప్పిందని వారు పేర్కొన్నారు. స్వల్ప గాయాలతో వారు బయటపడినట్లు తెలియాజేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.