ప్రకాశం: వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం అందించడం గొప్ప ఉపశమనమని యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా 18 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.11,90,333 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.