MBNR: బాలానగర్ మండలం మన్నెగూడెం తండాలో శుక్రవారం సర్పంచ్ రాజు నాయక్, ఉపసర్పంచ్ హిర్య నాయక్ పాల్గొని నూతన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. గ్రామస్తులకు పరిశుభ్రమైన తాగునీరు అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా ప్రజలు సులభంగా సురక్షిత నీటిని పొందగలుగుతారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు కూడా పాల్గొన్నారు.