అన్నమయ్య: మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు వంటి అంశాలపై విచారణ చేసి సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకుని ఆలస్యం లేకుండా న్యాయం చేయాలని ఆదేశించారు.