SDPT: రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి త్వరలోనే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని తెలిపారు. బండగుట్టపై నిర్మించిన 50 వసతి గదులు, క్యూకాంప్లెక్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.