SKLM: ప్రాథమిక స్థాయిలోనే జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం విద్యార్థులకు అత్యంత అవసరమని జిల్లా సర్వ శిక్ష అభియాన్ కెరియర్ గైడెన్స్ ప్రతినిధి శ్రీధర్ పేర్కొన్నారు. నరసన్నపేటలోని పెద్దపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు తమ ఆసక్తికి తగిన వృత్తిని ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.