నటి హన్సిక మోత్వానీ తన వైవాహిక బంధానికి స్వస్తి పలికింది. భర్త సోహైల్ కతూరియాతో ఆమె విడాకులు తీసుకున్నట్లు ముంబై కోర్టు అధికారికంగా మంజూరు చేసింది. 2022లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకోగా, కేవలం నాలుగేళ్లలోనే విడిపోయారు. సోహైల్ హన్సికకు చిన్ననాటి స్నేహితుడు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.