BHPL: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మార్చి 12న నిర్వహించనున్న మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, వార్డు సభ్యుల శిక్షణా తరగతులకు మినిట్ టు మినిట్ కార్యక్రమం సిద్ధం చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. గ్రామాలు-పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన సూచించారు.