PLD: పల్నాడు జిల్లాకు చెందిన హోంగార్డ్ SK ఖాసీం అలీ గతంలో డిప్యుటేషన్‌పై ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహిస్తూ 20 అక్టోబర్ 2025న రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా హోంగార్డులు తమ ఒక్క రోజు వేతనం సమీకరించి మొత్తం రూ. 5 లక్షలు సాయం అందించారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.