TG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలు చేసిన మహిళామణులను సత్కరించింది. ఈ మేరకు ప్రజాభవన్లో నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఉక్కు మహిళ సోనియా గాంధీ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, కీలక శాఖల్ని మహిళా అధికారులు సమర్థంగా నడిపిస్తున్నారన్నారు. అలాగే సమాజానికి మహిళలు అందిస్తున్న సేవలను కొనియాడారు.