TG: ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు మెనూలో మార్పులు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వారానికి ఒకరోజు చికెన్‌కు బదులుగా చేపలను చేర్చాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఒక వారం చికెన్, మరో వారం చేపలు అందించే అవకాశం ఉంది. దీనివల్ల విద్యార్థులకు అవసరమైన పోషకాలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.