SKLM: వజ్రపుకొత్తూరు మండలం పాతటెక్కలి గ్రామానికి చెందిన కె పావని అనే గర్భిణీ అత్యవసర పరిస్థితుల్లో రక్తహీనతతో బాధపడుతోంది. ఆ గర్భిణీకి బి నెగిటివ్ బ్లడ్ అవసరమని తెలుసుకున్న పలాస వాసి ఏ.అశోక్ వెంటనే స్పందించారు. ఆ గర్భిణీకి అవసరమైన బి నెగిటివ్ బ్లడ్ పలాస ప్రాణదాత బ్లడ్ బ్యాంక్లో శనివారం డొనేట్ చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నాడు.