‘విజయ్-రష్మిక నన్ను మీ పెళ్లికి ఎందుకు పిలవలేదు?’ అంటూ ఓ చిన్నారి అడిగిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై విజయ్ స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ‘బుజ్జితల్లి.. నిన్ను ఇంటికి లంచ్‌కు పిలుస్తాను. నీకు ఇష్టమైన ఫుడ్, స్వీట్స్ చెబితే అన్నీ ఇంట్లోనే చేయించుకుని తిందాం’ అంటూ ఆ వీడియో కింద కామెంట్ చేశాడు. చిన్నరి పట్ల విజయ్ చూపిన ఈ ఆప్యాయతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.