AP: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో బహ్రెయిన్‌లో చిక్కుకున్న ప్రసావాంధ్రులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇవాళ రాత్రి 59 మంది తెలుగువారు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. రామ్మోహన్ బహ్రెయిన్‌లో 238 మంది తెలుగువాళ్ల వివరాలను తీసుకున్నారు. కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.