TPT: వీజీబుల్ పోలీసింగ్‌లో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు గ్రామాలను సందర్శించారు. యువత, గ్రామ పెద్దలకు రోడ్డు భద్రత నియమాలు, సైబర్ నేరాలు, గంజాయి తదితర మత్తు పదార్థాల వల్ల కలిగే ప్రమాదాలపై వివరించారు.