TG: వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీ కోసం రూ.5,257 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వరంగల్ భూడ్రైనేజీ ప్రాజెక్టుకు జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ బ్యాంక్ రుణం ఇచ్చింది. 50 శాతం రుణం, 25 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు.