AP: సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అయిందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాం. ఈ ఏడాది ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మారుస్తాం. మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి.. చట్టసభల్లో ప్రాతినిధ్యం పెరుగుతుంది. యువతకు ఇదే ఆహ్వానం.. టీడీపీలోకి రండి అవకాశాలు ఇస్తాం’ అని పేర్కొన్నారు.