గుంటూరు: డీఈవో కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో షేక్ సలీం బాషా మహిళా సిబ్బందిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబం, సమాజంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో శైలజాబాయి, ఖుద్దుస్ తదితరులు పాల్గొన్నారు.