అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా టీ20 ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. గ్లోబల్ పాప్ స్టార్ రికీ మార్టిన్ ఈ వేడుకల్లో ప్రదర్శన ఇవ్వబోతున్నారు. అలాగే, సంగీత దిగ్గజాలు సుఖ్బీర్, ఫల్గుణి పాఠక్ కూడా తమ ప్రదర్శనలతో అలరించనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి.