CTR: గుడిపాల(M) నారగల్లు పంచాయతీ కొత్తకోటలో పయని అనే వ్యక్తి మద్యం మత్తులో తన కూతురిపై మచ్చుకత్తి విసరగా, అక్కడే ఉన్న అక్షయ (11) అనే 6వ తరగతి విద్యార్థినికి ఎడమ కాలుకు తీవ్ర గాయం అయ్యింది. ఆమెకు చిత్తూరు అమ్మా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితురాలి అమ్మమ్మ సరస ఫిర్యాదు మేరకు గుడిపాల పోలీసులు కేసు నమోదు చేసి పయనిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు.