నెల్లూరు రూరల్ పరిధిలో ఉండే దొంతాలి డంపింగ్ యార్డును మంత్రి నారాయణ పరిశీలించారు. చెత్త తొలగింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ వ్యవస్థను గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందన్నారు. వైసీపీ చేసిన అవకతవకల్ని ఇప్పుడిప్పుడే బయట పెడుతున్నామన్నారు. చెత్త రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.