AKP: మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ పిలుపునిచ్చారు. శనివారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను స్థానిక గవరపాలెంలో నిర్వహించారు. జేసీ మహిళలకు ఆత్మవిశ్వాసమే ఆయుధం కావాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళల కోసం మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.