కృష్ణా: గుడివాడ బస్టాండ్ సెంటర్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ.. జనసేన సభ్యత్వం తీసుకోవడం వల్ల ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా లభిస్తుందన్నారు. అనంతరం సాధక్ లకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.