TPT: వరదయ్యపాళెం మండలం ఇందిరానగర్ డంపింగ్ యార్డు వద్ద గంజాయి విక్రయాలు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం అనిల్ కుమార్, వివేకానంద, శ్రీనివాసులు, చెంచయ్యలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 200 గ్రాముల గంజాయి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో పాల్గొన్న ఎస్సై కేబీ మల్లిఖార్జున, సిబ్బందిని అధికారులు అభినందించారు.