TG: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సర్కార్ కేటాయించిన ఇళ్లలో లబ్ధిదారులు కాకుండా ఇతరులు నివసిస్తున్నట్లు తేలితే వారి ఇల్లును రద్దు చేయాలని నిర్ణయించింది. కొందరు లబ్ధిదారులు ఇళ్లను అద్దె, అమ్ముకోవడం వంటివి చేస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో అలాంటి వారిని గుర్తించేందుకు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది.