KNR: రామడుగు(M)లో ఇటీవల జరిగిన గౌరమ్మను గొంతు కోసి హత్య చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం విషయంలో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకుని తన తల్లిని తమ్ముడు అనిల్ కుమార్ హత్య చేసి ఉండవచ్చని పెద్ద కొడుకు మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.