NDL: డోన్ పట్టణ రిజిస్టర్ కార్యాలయం సమీపంలో నిర్మించనున్న నూతన ఆంజనేయస్వామి ఆలయానికి ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా అన్ని విధాల పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.