TPT: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మార్చి 9న వెంకటగిరిలోని విశ్వోదయ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్.లోకనాథం తెలిపారు. 13 కంపెనీలు పాల్గొని 895 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారన్నారు. యువత https://naipunyam.ap.gov.inలో మార్చి 8లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.