AKP: భవిష్యత్తులో ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెరగవని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాంబిల్లిలో శంకుస్థాపన వేదిక నుంచి ఆయన మాట్లాడారు. 23 లక్షల మంది రైతులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామన్నారు. 22 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కమర్షియల్ విద్యుత్‌ను యూనిటు రూ.9.95కి తగ్గించామన్నారు.