PPM: ఎమ్మెల్సీ అనంతబాబు పదవి రద్దు చేసి, అరెస్ట్ చేయాలని కురుపాంలోని గాంధీనగర్ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహం సమీపంలో గురువారం దళిత నేతలు ఆందోళన చేపట్టారు. దళిత నాయకుడు బి.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దళితులకు రక్షణ లేకుండా పోయిందని, హత్య ఘటనలో చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమిడి చంటి, బెలగాపు గంగులు, తదితరులు పాల్గొన్నారు.