KMM: బోనకల్లు మండలం పెద్ద బీరవల్లిలో పీఎసీఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కోనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు ప్రారంభించారు. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కారు కృషి చేస్తుందని రాయల స్పష్టం చేశారు. రైతులు పండించిన పంటలను చివరి గింజ వరకు ప్రభుత్వం కోనుగోలు చేస్తుందన్నారు.