E.G: చొప్పెల్లకు చెందిన వై. లోకేశ్ తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ముమ్మడివరంకి చెందిన ఓ విద్యార్థినిపై గురువారం హత్యాయత్నానికి ఒడిగట్టాడు. రాజానగరంలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఆమెను బలవంతంగా పార్కింగ్‌కి తీసుకెళ్లి చేతులు కట్టేసి పెట్రోల్ పోశాడు. లైటర్‌తో నిప్పంటించే ప్రయత్నంలో విద్యార్థిని కేకలు వేయడంతో స్థానికులు రక్షించారని పోలీసులు తెలిపారు.