WG: మద్యం రవాణా కేసులో సిట్ విచారణకు తాను హాజరు కాలేనని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికారులకు లేఖ రాశారు. తన భార్య అనారోగ్యం కారణంగా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నందున గురువారం రాలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో కారుమూరితో పాటు ఆయన కుమారుడు, కోడలిపై సిట్ కేసు నమోదైంది. ఇటీవల అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.