WGL: నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ డిపో ముందు రెండో రోజు సమ్మెలో భాగంగా గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికుడు కోల శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే సహచరులు అడ్డుకుని ఆయనను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.