NZB: బోధన్ మండలం నాగన్‌పల్లి క్రాస్ రోడ్ వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కొప్పర్తి క్యాంపునకు చెందిన కృష్ణ ప్రసాద్ తన ట్రాక్టర్ నిలిపి నిద్రిస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తి ఆ ట్రాక్టర్ నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన యువకుడిని 108 సిబ్బంది బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.