TG: ఆర్టీసీ సమ్మె రెండో రోజూ ఉధృతంగా కొనసాగుతోంది. రాణిగంజ్ డిపో వద్ద కార్మికులకు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మద్దతు తెలిపారు. కార్మికుల వెనుక కేసీఆర్ ఉన్నారని, ధైర్యంగా పోరాడాలని భరోసా ఇచ్చారు. నాడు రాష్ట్ర ఉద్యమంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషించిందని, వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గత కేబినెట్ నిర్ణయించిందని గుర్తుచేశారు.