బాపట్ల: ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు గురువారం తన నివాసంలో స్వయం గణన ప్రక్రియను పూర్తి చేశారు. తన కుటుంబ, గృహ వివరాలను ఆన్లైన్లో స్వయంగా నమోదు చేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరాలన్నా, అభివృద్ధి ప్రణాళికలు చేయాలన్నా కచ్చితమైన గణాంకాలు అవసరమన్నారు. ప్రజలంతా బాధ్యతగా జనగణనలో పాల్గొని అధికారులకు సరైన వివరాలు అందించాలని కోరారు.