MBNR: పాలమూరు విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ‘సకోర అభియాన్’ నిర్వహించారు. ఎండల దృష్ట్యా పక్షుల కోసం చెట్లకు ధాన్యాలతో కూడిన మట్టి కుండీలు కట్టారు. జీవరాశుల ఆకలి, దప్పిక తీర్చడం అందరి బాధ్యతని, జీవవైవిధ్యాన్ని కాపాడాలని ఉపకులపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.